నాట్స్ సహకారంతో నిర్మించిన నీటి ట్యాంకు ప్రారంభం
మండలంలోని మూగచింతల గ్రామం నందు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) సహకారంతో నిర్మించిన నీటి ట్యాంకును ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు మంచికలపూడి శ్రీనివాస్ మరియు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి బండారు వెంకట రవిచంద్రబాబులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రవిచంద్ర తన స్వగ్రామంలోని నీటి సమస్యను చూసి నాట్స్ సంస్థను నిధులు తీసుకునివచ్చి ట్యాంకును నిర్మాణానికి కృషి చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ మంచి పనికి సహాయపడిన నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్, కోశాధికారి మదన్, తానికొండ సురేష్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ సీబీఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ బండారు రవిచంద్ర బాబు, నాట్స్ అధ్యక్షులు మంచికలపూడి శ్రీనివాస్, కోశాధికారి మదన్, తనికొండ సురేష్, తెలుగుదేశం నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.