ఈగలపాడులో జన్మభూమి మా ఊరు కార్యక్రమం
మండలంలోని ఈగలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రన్న భీమా, వృద్ధులు వికలాంగులకు పెన్షన్లు, పంట నష్టపరిహారం, గ్రామంలో సిసి రోడ్లు వేయడం జరిగిందని ఈ అభివృద్ధి చూసి ఓర్వలేక విపక్షాలు నిన్ను నమ్మను బాబు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వారిని ప్రజలు ఎక్కడ మర్చిపోతారో అనే భయంతో ఇలాంటి అనవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివి శివరాం మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం మన ముఖ్యమంత్రి ఎంత కష్టపడుతున్నారో ప్రజలందరూ గుర్తించాలని అలాగే ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు