ప్రజాసంకల్పయాత్ర ముగింపు మహోత్సవం నిర్వహించిన బాలినేని యువసేన
బాలినేని యువసేన ఆధ్వర్యంలో కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామం నందు ప్రజాసంకల్పయాత్ర విజయవంతం అయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు ముగింపు మహోత్సవం జరుపుకున్నారు. తొలుత గొట్లగట్టులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బాలినేని యువసేన జిల్లా అధ్యక్షులు సుబ్బానాచారి మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఎన్నో అవాంతరాలు ఏర్పడినా కూడా వాటికి భయపడకుండా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 341రోజుల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం తధ్యమని దానికి కష్టాన్ని కూడా ఇష్టంగా జగన్ తో అడుగులో అడుగులు వేస్తూ నడిచిన ప్రజలే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో గొట్లగట్టు మాజీ సర్పంచ్ మర్రి వెంకటేశ్వర్లు, జెక్కిరెడ్డి కృష్ణారెడ్డి, మన్నం శేషయ్య, చిన్నపురెడ్డి కృష్ణారెడ్డి, కాశిరెడ్డి, నాగం బాలగురవయ్య, పెద్ద కాశయ్య, చిన్న కాశయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.