ప్రత్యేక హోదా సంతకాల సేకరణకు బార్ అసోసియేషన్ మద్దతు
బాలినేని యువసేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక హోదా సంతకాల సేకరణ ఉద్యమానికి పొదిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమనకిశోర్, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, బాషా, ఉడుముల గురవారెడ్డి, తాడికొండ సుబ్బారావు, వెంకటేశ్వర్లు, ధర్నాసి పెద్దన్న, బాషా, సుబ్బారావు తదితరులు సంతకాలతో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని యువసేన జిల్లా అధ్యక్షులు సుబ్బానాచారి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనకై చేపట్టిన ఈ సంతకాల సేకరణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకహోదా ఆంధ్రులహక్కు నినాదంతో ముందుకు వెళ్తున్నామని ప్రజలందరూ కూడా తమ హక్కును తమ తమ సంతకాలతో ఉపయోగించుకుంటూ ప్రత్యేక హోదాకై ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే ఎల్లవేళలా జగన్ కు తోడుగా జగన్ తోనే నడుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, మండల కో అప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ వలి, బాలినేని యువసేన నాయకులు జెక్కిరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.