పింఛన్లు 1వెయ్యి నుండి 2వేలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుకగా తీపికబురు అందించారు. 1వెయ్యి రూపాయలుగా ఉన్న పింఛన్లను 2వేల రూపాయలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరుజిల్లా బోగోలు జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ జనవరి నుంచే పెంచిన పింఛన్ చెల్లిస్తారని దీని ద్వారా 54లక్షల మంది పించన్ దారులు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది పొందుతారని అన్నారు. ఎన్నికల సమయంలో పింఛన్ నెలకు 2వేల రూపాయలకు పెంచడంపై ప్రజలలో మిశ్రమ స్పందన వచ్చింది.