పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రవీణ్, సుభాని విజయం
పోలీస్ అసోసియేషన్ పొదిలి సర్కిల్ నందు జరిగిన ఎన్నికలలో ప్రవీణ్ మరియు సుభానిలు విజయం సాధించారు. వెళితే రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో పొదిలి సర్కిల్ నుండి రెండు జిల్లా కమిటీ సభ్యుల పదవులకు ఎన్నిక జరగగా పొదిలి సర్కిల్ ఆఫీస్ నందు పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించారు. మొత్తం పోలైన 81 ఓట్లలో ప్రవీణ్ కు-32……సుభానికి-28 ఓట్లతో ఇరువురు విజయం సాధించారు. జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారి నుండి నూతన కమిటీ ఎన్నిక జరుగుతుందని వారు తెలిపారు.