రేపు పొదిలిలో జనసేన నేత చంద్రశేఖర్ యాదవ్ పర్యటన
ప్రకాశంజిల్లా జనసేన నాయకులు చంద్రశేఖర్ యాదవ్ పొదిలి మండలంలో ఆదివారంనాడు పర్యటించనున్నారు. జనసేన పార్టీలో చేరి మొదటిసారిగా పొదిలికి విచ్చేస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలుకుతూ కాటూరివారిపాలెం నుండి మార్కాపురం అడ్డరోడ్డు వరకు బైక్ ర్యాలీ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ కార్యక్రమములో పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆ ప్రకటనలో కోరారు.