బార్ అసోసియేషన్లు మూడు ఉన్నాయి….. గుర్తింపు పొందిన బార్ అసోసియేషన్ మాత్రం మాదే
గత మూడు రోజులుగా పొదిలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు చీలిక బార్ అసోసియేషన్ల ఏర్పాటుపై ఆదివారంనాడు బార్ అసోసియేషన్ రిజిస్టర్డ్ నంబర్.182/2014 న్యాయవాదులు మాట్లాడుతూ పొదిలి కోర్టు స్థాపించినప్పటి నుండి న్యాయవాదుల సమస్యలపై పోరాటం చేస్తున్నామని నిజానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ 182/2014ను అధికారికంగా గుర్తించి ఎన్నికల కొరకు గుర్తింపును జారీ చేశారని తెలిపారు. అలాగే గత మూడు రోజులుగా వస్తున్న చీలిక బార్ అసోసియేషన్లను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 182/2014 బార్ అసోసియేషన్ లో అధ్యక్షులుగా డివి హరిప్రసాదరావు, ఉపాధ్యక్షులుగా యం రాంబాబు, జి సుజాత, కార్యదర్శిలుగా ఎస్ బాలబ్రహ్మం, కె నరసింహారాజు, కోశాధికారిగా టి రామ్మోహనరావు, కార్యనిర్వాహక సభ్యులుగా యం నారాయణరెడ్డి, ఎస్ శ్రీనివాసరావు, జి సుబ్బారావు, యు లక్ష్మీరెడ్డిలు పదవులలో కొనసాగుతున్నట్లు తెలిపారు.