బిసిలు అండగా ఉండండి మీకు జనసేన ఎప్పుడు అండగా ఉంటుంది జనసేన పార్టీ జిల్లా నాయకులు చంద్ర శేఖర్ యాదవ్
వెనుకబడిన తరగతులకు చెందిన వారు జనసేన పార్టీకి అండగా ఉండండి మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ జిల్లా నాయకులు బైరబోయిన చంద్ర శేఖర్ యాదవ్ అన్నారు. వివరాల్లోకి వెళితే స్ధానిక రోడ్లు భవనముల అతిధి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన బిసికులాల సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ బిసిలకు రాజ్యాధికారం వాటా జనసేన పార్టీ ద్వారానే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో అధిక స్ధానాలు బిసిలకు కేటాయించే విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని ఆ దిశగా బిసిలందరూ జనసేన పార్టీకి అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో జనసేన విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. జనసేన పార్టీ ద్వారానే సామాజిక న్యాయం అందరికి దక్కుతుందని బిసిలకు అండగా జనసేన పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.