జనసేన ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…. ద్విచక్ర వాహన ర్యాలీ సామాజిక న్యాయం జనసేనతోనే….. జిల్లా నాయకులు చంద్ర శేఖర్ యాదవ్
జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ ద్విచక్ర వాహనాల ర్యాలీని జనసేన కార్యకర్తలు భారీ స్ధాయిలో నిర్వహించారు. వివరాలు లోకి వెళితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని కాటూరి వారిపాలెం నందు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా నాయకులు బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్ ఆవిష్కరించారు. తొలుత ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాటూరి వారిపాలెం నుండి మార్కాపురం అడ్డురోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర శేఖర్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యధికారం దక్కని కులాలకు సామాజిక న్యాయం చేసే ఏకైక పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీఅని జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రజలు ఆదరించి అధికారంలోకి రావడానికి అవకాశం ఇవ్వాలనిఅన్నారు. కులాలకు మతాలకు అతీతంగా పని చేస్తున్న జనసేన పార్టీని గ్రామ స్ధాయి నుండి పటిష్టంగా తయారు చేయడంలో కార్యకర్తలు బలంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు ముల్లా బాజీ కరిముల్లా నాయకత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సోషల్ జస్టిస్ జిల్లా కో కన్వీనర్ పట్నం శ్రీనివాస్, మండల నాయకులు షేక్ కాలేషా, వెంకటేష్,ఆది , సన్నీ బాబు, యస్పీ ఖాజా ఇంతియాజ్, నవీన్ నాగార్జున యాదవ్, పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.