పొదిలి టైమ్స్ 2019 డైరీ ఆవిష్కరించిన ఇమ్మడి
పొదిలి టైమ్స్ 2019ఆంగ్ల సంవత్సరండైరీని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి ఇమ్మడి కాశీనాథ్ ఆవిష్కరించారు. వివరాల్లోకి వెళితే మంగళవారం సాయంత్రం స్ధానిక రోడ్లు భవనముల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఇమ్మడి కాశీనాథ్ డైరి ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ పొదిలి టైమ్స్ ప్రజా పక్షం వైపు ఉండి ప్రజాసమస్యలపై తమ గళాన్ని వినిపించాలని ఆకాక్షంచారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం మాజీ పాలకవర్గ సభ్యులు పత్తి వెంగన్న, వైసీపీ పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తపులి బ్రహ్మ రెడ్డి, తెదేపా మండల నాయకులు గునుపూడి భాస్కర్, కాటూరి నారాయణ, ప్రతాప్, గంగవరపు దీప, కాటూరి వెంకట సుబ్బయ్య జ్యోతి మల్లి, ముని శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు షేక్ రబ్బానీ, షేక్ జవేద్, జనసేన పార్టీ నాయకులు షేక్ కాలేషా, ముల్లా బాజీ కరిముల్లా, లోక్ సత్తా చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ వీర్ల శ్రీనివాస్ యాదవ్, యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పోల్లా నరసింహ యాదవ్, ప్రెస్ మిత్రులు దరిశి శివాజీ, పందిటి సునీల్, బిసి నాయకులు మచ్చా రమణయ్య, పొదిలి టైమ్స్ ప్రతినిధులు మందగిరి వెంకటేష్ యాదవ్, షేక్ మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు.