పయనించే పతంగి ఎగురు ఎగురు……..
పొదిలి స్థానిక పాత ఆర్టీసీ గ్రౌండ్స్ నందు పతంగుల పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పతంగుల పోటీకి ముఖ్య అతిధిగా హాజరైన రీజియన్ చైర్మన్ సోమిశెట్టి చిరంజీవి పోటీలు ప్రారంభించి 3విభాగాలుగా విభజన చేసిన పలు వయస్సుల వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా చంద్రశేఖర్, రామాంజనేయులు, శ్రీను, కోటేశ్వరరావు, డాక్టర్ కొండా నాగరాజు వ్యవహరించగా అధ్యక్షులు జిఎస్ఆర్, హరిత, పమిడిమర్రి కృష్ణ, మునగా సత్యం, సోమిశెట్టి శ్రీదేవి, మాగులూరి రామసుధాకర్, రావూరి సుబ్బరాయుడు, మేడా నరసింహరావు, యాదాల సుబ్బారావు, ప్రసాద్, పందిటి సునీల్ తదితరులు పాల్గొన్నారు.