మోటారు సైకిళ్ళు ఢీ ……..ఇద్దరికి తీవ్ర గాయాలు
రెండు మోటారు సైకిళ్లు ఢీకొని ఇద్దరు గాయపడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మాదాలవారిపాలెం గ్రామ సమీపంలో రోడ్డు మూల మలుపు వద్ద రెండు బైకులు ఢీకొనడంతో మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన కె బాలగురవయ్య, హరి అనే ఇద్దరు తీవ్రంగా గాయపడగా దొనకొండకు చెందిన నవీన్ కాశీరావులు సల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్ధానికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు
తరలించగా ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యంకోసం ఒంగోలుకు తరలించారు.