నూకసానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి : అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్
ప్రకాశంజిల్లా మాజీ జిల్లాపరిషత్ ఛైర్మన్ నూకసాని బాలాజీకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని అఖిలభారత యాదవ మహాసభ డిమాండ్ చేసింది. పొదిలిలోని స్థానిక అఖిల భారత యాదవ మహాసభ కార్యక్రమంలో శనివారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లాలో 56మండలాల్లో బలమైన అనుచరవర్గం కలిగిన నాయకుడిగా వైసీపీ జిల్లా వ్యవస్థాపకఅధ్యక్షులుగా ఉండి కందుకూరు సమన్వయకర్తగా పోతుల రామారావు గెలుపులో అత్యంత కీలక పాత్రపోషించి జిల్లాలోని బీసీలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నూకసాని బాలాజికి టికెట్ కేటాయిస్తే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని…. వైసీపీ2 మరియు జనసేన2 జిల్లాలో టిక్కెట్లు కేటాయిస్తున్నాయని నూకసాని బాలాజికి టిడిపి ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబూరావు యాదవ్, తలమళ్ల మాజీ సర్పంచ్ వీర్ల శ్రీనివాస్ యాదవ్, వేల్పుల కృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.