కందులకు పార్టీ అధిష్ఠానం ఏం గిఫ్ట్ ఇవ్వనుంది…..?
మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఖరారు చేసే విషయంలో రేసులో ఉన్న నేతలను అమరావతికి రావాలని అధిష్ఠానం ఆదేశించింది. ఇప్పటికే పలువురు నేతలు అమరావతి చేరుకోగా రేపటి నుండి చర్చలు జరిపి ఈ నెల 30న అభ్యర్థి ఖరారు చేసే యోచనలో ఉండగా……. నియోజకవర్గ రాజకీయాలలో ఈ విషయమై కీలక చర్చ జరుగుతోంది. ఇప్పటి ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి టికెట్ పై ధీమా వ్యక్తం చేస్తుండగా….. మార్కాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఇప్పటికే పలు కీలక పదవులలో నాయకులు కూడా ఇదే స్థానం నుండి టికెట్ అశిస్తుండడంతో టికెట్ ఎవరికి దక్కుతుంది?….. అని నియోజకవర్గ రాజకీయాలలో ఉత్కంఠ నెలకొంది…. ఇప్పటికే నియోజకవర్గంలోని పలువురు కీలక నాయకులతో అధిష్ఠానం భేటీ అనంతరం కందులపై అధిష్ఠానం కొంత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం……. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో గెలుపే లక్ష్యంగా యోచిస్తున్న అధిష్టానం కందులకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతోంది?……అనే ఉత్కంఠకు ఈనెల 30న తెరపడనుంది.