తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు….. అధికారులను హెచ్చరించిన రామకృష్ణారెడ్డి
స్థానిక అడ్డరోడ్డులోని పౌరసరఫరాల సంస్థ గిడ్డంగి ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రామకృష్ణారెడ్డి గోదాము ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్రంలో ఉన్న 13జిల్లాల్లో పర్యటించి తనిఖీలు నిర్వహించగా 12జిల్లాల్లోని పౌరసరఫరాల సంస్థలో ఎలాంటి అవకతవకలు లేవని ప్రకాశం జిల్లాలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించి ఒక ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జ్ ను సస్పెండ్ చేశామని ఇప్పుడు కూడా అదే తీరుతో ఉంటే 30రోజులలోగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే 650మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన ఈ గోదాము ద్వారా పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి 3మండలాలలోని 91రేషన్ దుకాణాలకు 605మెట్రిక్ టన్నులను సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ఈ 3మండలాలలోని 91రేషన్ దుకాణాల పరిధిలో రెండు నెలల క్రితం 47000 కార్డుదారులు ఉండగా ఇప్పుడు 48200ఉన్నాయని అన్నారు రేషన్ డీలర్లు కార్డు దారులను మోసాగించకుండా 48200మందికి సక్రమంగా రేషన్ అందించాలని సూచించారు. అలాగే త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివి శివరాం, పౌరసరఫరాల సంస్థ జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, శివపార్వతి, డిప్యూటీ తహశీల్దార్ జనీబేగ్, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.