ఘనంగా లోకేశ్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే బుధవారంనాడు స్ధానిక విశ్వనాథపురం ఆంజనేయస్వామి గుడి నుండి పెద్ద బస్టాండ్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం జన్మదిన కేకును కోసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, సామంతపూడి నాగేశ్వరరావు,యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, షేక్ రసూల్, ముల్లా ఖుద్దూస్, షేక్ షబ్బీర్, షేక్ యాసిన్, తెలుగు మహిళా నాయకులు షేక్ షాన్వాజ్, కిరణ్మయి, తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకులు కాటూరి వెంకటేశ్వర్లు, పావులూరి నిమ్మేష్, తదితరులు పాల్గొన్నారు.