జిల్లాలో 10 శాసనసభ 2పార్లమెంట్ స్ధానాలు తెదేపా సొంతం : జిల్లా గ్రంధాలయం చైర్మన్ వైవి సుబ్బారావు
ప్రకాశం జిల్లా పరిధిలోని ఒంగోలు బాపట్ల లోక్ సభ స్ధానంలో మరియు జిల్లాలో 10శాసనసభ స్ధానాలను తెలుగు దేశం పార్టీ కైవసం చేసుకుంటుందని ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ వైవి సుబ్బారావు అన్నారు. పొదిలి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా పొదిలి టైమ్స్ ప్రతినిధి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జిల్లాలో ప్రాధాన్యత తగ్గలేదని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ప్రజలు అర్ధం చేసుకున్నారని 2లోక్ సభ మరియు 10శాసనసభ స్థానాలలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని తెలిపారు.