ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత 70వ గణతంత్ర దినోత్సవం వేడుకలను పొదిలిలో ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మరియు విద్యా సంస్థలలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాలను ఎగురవేశారు. స్ధానిక మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యలయంలో తహశీల్దార్ విద్యాసాగరుడు జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు15న వచ్చినప్పటికీ బ్రిటిష్ పరిపాలన విధానంలోనే పాలన జరిగింది అనంతరం జనవరి 26న మన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తిగా మన పరిపాలనలోకి రావడం వలన జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఎందరో మహానుభావుల త్యాగఫలమే మన మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్చా, స్వాతంత్ర్యాలు అని అన్నారు…..అలాగే పట్టణంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు ప్రభుత్వ, ప్ర్రెవేటు విద్యా సంస్థలలో జెండా ఆవిష్కరణ అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యత, మన స్వాతంత్ర్య భారతావని గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో వివిధ ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బంది, పాఠశాల, కళాశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.