వైసీపీలోకి మాజీ సిఐ…..
అతనో మాజీ సిఐ….. కానిస్టేబుల్ నుండి అంచెలంచెలుగా ఎదిగి సిఐ స్థాయిలో కదిరి సర్కిల్ నందు విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ అధికారపార్టీ ఎంపీపై మీసం మెలిపెట్టి సవాల్ విసిరిన ఓ పోలీసు నాయకుడు…… ఇదంతా గతంలో…… కానీ ఇప్పుడు ఒక వైసీపీ నేత……అవును మీరు ఊహించింది నిజమే ఆయనే కదిరి మాజీ సిఐ గోరంట్ల మాధవ్……. కానీ ఏవో కారణాలతో రాజీనామా చేశానని చెప్పారు కానీ ప్రజలు ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారని ఊహించారు…… ఇప్పుడు ప్రజలమాటే నిజమైంది….. శనివారంనాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు…… ఆయన సిఐ గా ఉన్న సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని “నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నాలుక కోస్తాం” “మేము మగాళ్ళం” అంటూ మీడియా ఎదుట మీసం తిప్పి జేసీ దివాకర్ రెడ్డిని హెచ్చరించిన సంగతి తెలిసిందే…… అయితే అప్పట్లో ఈ విషయం చాలా చర్చనీయాంశంగా మారింది….. పోలీసు నాయకుడిగా మంచి పేరును పొందిన మాధవ్ మరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చూడాలి……. ఇంతకీ ఈయన పార్టీలో అయితే చేరారు కానీ ఎక్కడినుండి పోటీ చేసే అవకాశం ఉంది….. అసలు పోటీ చేస్తారా లేక నాయకుడిగానే ఉండిపోతారా అనేది కొంచెం వేచి చూడాలి.