ఉత్తమ ప్రతిభా పురస్కారం అందుకున్న సీడీపీఓ….
పొదిలి మండల బాలల అభివృద్ధి ప్రణాళిక అధికారిణి కృష్ణవేణికి ఉత్తమ ప్రతిభా పురస్కారం లభించింది. గర్భిణీ స్త్రీల పౌష్టికాహారం కోరకు ఏర్పాటు చేసిన న్యూట్రీ గార్డెన్ మరియు అంగన్వాడీ పాఠశాలల అభివృద్ధి వంటి పలు సేవలకు గాను ఉత్తమ సీడీపీఓగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎస్పీ సత్య యేసుబాబు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.