భూ వివాదాలలో దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం : డియస్పీ నాగరాజు

భూ వివాదాలలో దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని దరిశి డియస్పీ కె నాగరాజు అన్నారు. స్ధానిక పొదిలి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూములకు సంబంధించిన వివాదాలను సివిల్ కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులు చేయదగినవి చేస్తారని ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పొదిలి సిఐ షేక్ చిన్న మీరాసాహెబ్, పొదిలి యస్ఐ తూళ్లూరి శ్రీరామ్, తాడివారిపల్లి యస్ఐ పాల్గొన్నారు.