భరోసా పెన్షన్లు, పసుపు కుంకుమ కానుకలను మూడు రోజుల్లోనే పంపిణీ చేయాలి : ఎంపిడిఓ రత్నజ్యోతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పసుపు కుంకుమ కానుకను డ్వాక్రా మహిళలకు అందజేయాలని, అలాగే భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందేలా చూడాలని ఎంపీడీఓ రత్నజ్యోతి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్, రెవిన్యూ, వెలుగు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిడిఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లబ్దిదారులకు భరోసా పెన్షన్లు, ద్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కానుకను ఫిబ్రవరి 2, 3, 4, తేదీలలో ప్రతి పంచాయతీలో ఆయా తేదీలను టాంటాం ద్వారా ప్రజలలోకి తీసుకుని వెళ్లి లబ్ధిదారులు ప్రతి ఒక్కరు హాజరయ్యేలా చూడాలని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి ప్రాంగణంలో కూర్చునే వసతులు, అల్పాహారం, మంచినీరు, వంటివి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రత్నజ్యోతి, డిప్యూటీ తహశీల్దార్ జానిబేగ్, ఈఓఆర్డీ రంగనాయకులు, సుపెరింటెండెంట్ హనుమంతరావు, వెలుగు సిసి బాలసుబ్రహ్మణ్యం, రెవిన్యూ సిబ్బంది, వెలుగు సిబ్బంది, పలు గ్రామ పంచాయతీల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.