జనసేన వైద్యశిబిరానికి విశేష స్పందన….. భారీగా తరలివచ్చిన ప్రజలు
జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల (తూర్పుపాలెం) వద్ద జనసేన పార్టీ అనుబంధం విద్యార్థి సంఘం భగత్ సింగ్ విద్యార్థి సంఘం (బి యస్ యు) ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు వారి సౌజన్యంతో ఏర్పాటు మెగా వైద్యశిబిరాన్ని జనసేన పార్టీ జిల్లా నాయకులు కందుకూరి బాబురావు ప్రారంభించారు.
అనంతరం ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యనిపుణులు యస్ నరసింహమూర్తి మాట్లాడుతూ జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఈ వైద్యశిబిరంలో పేద ప్రజలు భారీగా పాల్గొని సద్వినియోగం చేసుకుని వైద్యపరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను పొందారని…… జనసేన నాయకులు ఆరోగ్యమే మహాభాగ్యమని ఇంతటి మహోన్నత కార్యక్రమం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు…… ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలను యువ నాయకులు నిర్వహించాలని ఆకాంక్షించారు.
జనసేన నాయకులు కందుకూరి బాబూరావు మాట్లాడుతూ జనసేన ద్వారా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని…… అలాగే మునుముందు చేయబోయే కార్యక్రమాల నిర్వహణలను కూడా ప్రజలు ఆదరాభిమానాలు ఇలానే ఉండాలని ప్రతి కార్యక్రమంలో ప్రజలు తమ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సోషల్ జస్టిస్ విభాగం జిల్లా జాయింట్ కన్వీనర్ పట్నం శ్రీనివాస్, జనసేన మండల నాయకులు షేక్ కాలేషా, భగత్ సింగ్ విద్యార్థి సంఘం నాయకులు షేక్ హల్ ఛల్ జహీర్, జనసేన యువజన నాయకులు నాగర్జన యాదవ్, బండారు శివ యాదవ్, సన్నీ, షేక్ షఫీ, షేక్ ఖాజా, ముల్లా ఆరిజ్, కార్తీక్ నాయుడు, కిషోర్, ఏసు బాబు, షేక్ యాసిన్, షేక్ నాగుర్ మరియు కిమ్స్ వైద్యులు కమల్ హాసన్, ప్రశాంతి, పావని, నందకిషోర్, కిమ్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ యన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.