వైవి నివాసంలో కెపి, ఉడుముల కీలక చర్చలు….రేపు జగన్మోహన్ రెడ్డితో బేటీ

ఒంగోలు తాజా మాజీ పార్లమెంట్ సభ్యులు వై వి సుబ్బారెడ్డి నివాసంలో శుక్రవారం మాజీ శాసనసభ్యులు కెపి కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డిలు కీలక సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసంలో వైసీపీ మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థిత్వం తమకు కేటాయించే విషయం సహా పలు అంశాలపై కెపి కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డిలు సుదీర్ఘ మంతనాలు జరిపారు. గత ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపులో తమకు ఈసారి టిక్కెట్ కేటాయించి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు అవకాశం ఇవ్వాలని గట్టి పట్టుబట్టి పలుఅంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం జిల్లా పార్టీ ఇన్చార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా సమావేశమై తమకు ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. శుక్రవారంనాడు వీరిద్దరితో సమావేశం అనంతరం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శనివారం నాడు భేటీకి సమయం కేటాయించారని భేటీ అనంతరం నియోజకవర్గ వైసీపీ టిక్కెట్ కేటాయింపుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.