పసుపుకుంకుమ చెక్కుల పంపిణీలో అధికారపార్టీ నాయకుల అత్యుత్సాహం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెట్టింపు భీమా-రెట్టింపు భరోసా పెన్షన్లు మరియు డ్వాక్రా మహిళల పసుపుకుంకుమ కానుక పంపిణీలో మరోసారి అధికారపార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే స్థానిక ఏబిఎం స్కూల్ వేదికగా నిర్వహించిన పెంచిన పెన్షన్లు, పసుపుకుంకుమ కానుకలు అధికారులు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారిచేయగా ఒక్క పెన్షన్లు మాత్రమే అధికారుల చేతులమీదుగా పంపిణీ చేశారు. మిగిలిన పసుపుకుంకుమ మరియు రైతుభరోసా వద్ద అధికారుల ప్రమేయం లేకుండా మండల అధికారపార్టీ నాయకులు మాత్రమే పంపిణీ చేశారు. అధికారులు ఎవరు కౌంటర్ల దగ్గర లేకపోవడంతో అధికారపార్టీ నాయకులు వారికి కావలసిన వాళ్లకు మాత్రమే చెక్కులను అందజేసి మిగిలిన గ్రూపుల మహిళలను రేపు రమ్మని చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఈ విషయమై కొందరు మహిళలు మాట్లాడుతూ అధికారులు ఒక్కరోజే ఈ కానుకల పంపిణీ జరుగుతుందని చెప్పడంతో ఉదయాన్నే వచ్చామని ఇక్కడికి వచ్చిన తర్వాత కౌంటర్లో అధికారులు లేరని అక్కడ ఉన్న నాయకులు మాత్రం రేపు రమ్మని చెప్పారని అలాంటప్పుడు ఒక్కరోజే అని సమాచారం ఇవ్వడం ఎందుకు అసలు అధికారులు పంపిణీ చెక్కులు అధికారపార్టీ నాయకులు ఎందుకు పంపిణీ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు