టిక్కెట్ కేటాయించాలని జగన్ ను కోరిన కేపి, ఉడుముల….. సర్వే ఆధారంగా కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేసిన జగన్
మార్కాపురం నియోజకవర్గ వైసీపీ టిక్కెట్ తమకు కేటాయించాలని మాజీ శాసనసభ్యులు కేపి కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డిలు జగన్ ను కోరారు. వివరాల్లోకి వెళితే టిక్కెట్ కేటాయింపు విషయంలో మాజీ శాసనసభ్యులు కేపి కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డిలు శనివారంనాడు లోటస్ పాండ్ లోని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి గత ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు తమకు టిక్కెట్ కేటాయించాలని కోరగా…… ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపధ్యంలో టికెట్ ఎవరికి కేటాయించాలి అనే విషయంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నానని అందుకే ఈ విషయమై నియోజకవర్గంలో సర్వే జరుగుతుందని సర్వే నివేదికల ఆధారంగానే టికెట్ కేటాయింపుపై తుదినిర్ణయం తీసుకుంటామని……. మీరేమి అధైర్యపడవద్దు మీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని చెప్పినట్లు సమాచారం…. జగన్ తో భేటీ అనంతరం శనివారంనాడు సాయంత్రం కేపి, ఉడుముల నియోజకవర్గం చేరుకున్నారు….. ఈ విషయంపై కేపి, ఉడుముల వారి అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున నియోజకవర్గ రాజకీయాల్లో ఒకింత మార్పు చోటుచేసుకోనుందా అనేది తెలియాలంటే కొంచెం వేచిచూడాలి.