చంద్రన్న రెట్టింపుభీమా – రెట్టింపుభరోసా కార్యక్రమంలో అపశృతి….. మహిళ మృతి

మండల పరిధిలోని రామాపురం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన రెట్టింపుభీమా – రెట్టింపుభరోసాలో భాగంగా ఏర్పాటు చేసిన పెన్షన్ మరియు పసుపుకుంకుమ కానుకల పంపిణీ కార్యక్రమంలో గుండెపోటుతో మహిళ మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రామాపురం గ్రామానికి చెందిన దేశం సుబ్బులు అనే మహిళ పెన్షన్ దారు మరియు డ్వాక్రా మహిళ కావడంతో శనివారం ఉదయమే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సుమారు మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమం జరిగిన అనంతరం వారి గ్రూపు చెక్కు అందుకోవడానికి పిలవగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలడంతో పక్కనే ఉన్న వారి గ్రూపుసభ్యులు, మహిళలు ఆమెకు నీరు త్రాగించి పక్కనే ఒక ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పి 15నిమిషాల తరువాత తన ఇంటికి తీసుకుని వెళ్లగా మరలా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స కొరకు పొదిలి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు…… కాగా ఆమె సొమ్మసిల్లి పడిపోయినప్పుడే అక్కడ ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ పరిస్థితిని గమనించి వైద్యశాలకు తరలించి ఉంటే ఆమె బ్రతికే అవకాశం ఉండేదేమో అని పలువురు అభిప్రాయపడ్డారు.