టిక్కెట్ మాదే…. ధీమా వ్యక్తంచేసిన కేపి
మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ మాకే వస్తుందని మాజీ శాసనసభ్యులు కేపి కొండారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళితే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని శనివారం కలిసిన మాజీ శాసనసభ్యులు కేపి కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డిలు శనివారంనాడే నియోజకవర్గం చేరిన సంగతి తెలిసిందే… కాగా ఆదివారంనాడు పొదిలి వైసీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు జి శ్రీను పితృవియోగ పరామర్శ అనంతరం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తరువాత మొదటిగా పొదిలిటైమ్స్ ప్రతినిధితో మాట్లాడుతూ వైఎస్ జగన్ వారికి సానుకూలంగా స్పందించారని, టిక్కెట్ తమకే దక్కుతుందన్న ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు సన్నిహితులగా మెలిగి ఈరోజు జగన్ మాకు టిక్కెట్ ఇవ్వనంత మాత్రాన…… టిక్కెట్ దక్కలేదని వేరే పార్టీలో చేరే అవసరం లేదని ఏదేమైనా మేము వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు…. ఈ సందర్భంగా మేము వేరే పార్టీకి మద్దతిస్తామని చెప్పడం అవన్నీ ఒట్టి పుకార్లేనని వైసీపీ బలోపేతానికి తామెప్పుడు కట్టుబడి ఉన్నామని…… సర్వే ఆధారంగా జగన్ టిక్కెట్ కేటాయిస్తానని చెప్పారని సర్వే నివేదికలు వారి పక్షాన ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుజ్జుల రమణారెడ్డి, జి శ్రీను,కళ్ళం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, మాజి ఎంపీటీసీ సభ్యులు బంధిసాహెబ్, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.