వైసీపీ నాయకులు అనుచరులతో కేపి భేటీ…..

స్థానిక రహదారులు మరియు భవనముల శాఖ అతిథి గృహంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలతో కేపి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ మరియు రాజకీయ భవిష్యత్తు తదితర అంశాలపై చర్చ జరగగా కేపి నాయకులతో మాట్లాడుతూ జగన్ తమపట్ల సానుకూలంగా స్పందించారని టిక్కెట్ తమకే వస్తుందని నాయకులు అనుచరులు నిరుత్సాహ పడకుండా సర్వే నివేదికలు తమకు అనుకూలంగా వచ్చేలా విధి విధానాలను రూపొందించి సర్వే నివేదికలు అనుకూలంగా వచ్చేలా చూడాలని తదుపరి నిర్ణయం జగన్ తీసుకుంటారని…. ఇది రాజకీయ కోణంలో కాకుండా తమకు టిక్కెట్ ఎలా రావాలనే దానిపై దృష్టిపెట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నాయకులకు సూచించారని……రాజకీయ కోణంలోని పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.