ఆర్టీసీ జేఏసి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
ఆర్టీసీ కార్మికుల వేతన సవరణకై ఆదివారంనాడు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వివరాల్లోకి వెళితే స్థానిక ఆర్టీసీడిపో వద్దనుండి పెద్ద బస్టాండ్ చిన్నబస్టాండ్ మీదుగా మళ్ళీ ఆర్టీసీ డిపో చేరుకున్న జేఏసి నాయకులు మాట్లాడుతూ తమకు చేయాల్సిన వేతన సవరణ 2017బిల్లులో చేయాల్సినప్పటికి 2019వచ్చినా కూడా ఆ ఊసే పట్టని ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికుల 50శాతం ఫిట్మెంట్ మరియు ఆర్టీసీ పరిరక్షణ కొరకు 700కోట్లు కేటాయించడం ,సిబ్బంది కుదింపు చర్యలు మానుకోవాలనే……మొదలైన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ ప్రకాశం కార్యదర్శి రమేష్, ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి కెవి రావు, ఎం సురేష్, వెంకటేశ్వర్లు, టి వెంకటేశ్వర్లు, షేక్ కె బాషా, చిన్న బాషా, పుల్లయ్య, కాలేబు ,కె హెచ్ రావు, వేణు, ఈఎస్ రావు, కొండలరావు, ఆర్ఎస్ రావు, సుభాని, షేక్ కె బాషా, ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.