గెలిచివస్తా లేదంటే నాతల మీ ముందు పెడతా : కందుల

ఒక్క అవకాశం ఇవ్వండి గెలిచివస్తా లేదంటే నాతల మీ ముందు పెడతానని చంద్రబాబుకు చెప్పి వచ్చానని కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద పాదయాత్ర ముగింపు సభలో మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ తాను కూడా ఓ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చానని…… జనంలో ఎంతో ఆప్యాయతానురాగాలతో పెరిగానని అన్నారు.

అలాగే ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొన్న నాయకులలో నేను ఒకడిని ఆ సమయంలో ఓడిపోయిన ఎమ్మెల్యే నేను ఒక్కడినే అని……. నేను గెలిచిన సమయంలో మన ప్రభుత్వం లేదు నేను ఓడిన సమయంలో ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కొంతమేర నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి నిధులు సేకరించగలిగానని…. ముఖ్యంగా ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు ఎన్నో తెలుసుకున్నానని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలు అర్ధం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.