జన సమీకరణలో తెలుగు తమ్ముళ్లు విఫలం…..

మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ జన సమీకరణలో తెలుగు తమ్ముళ్లు విఫలమయ్యారు. వివరాల్లోకి వెళితే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముగింపు సభకు తెలుగుదేశం నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 10వేల మందికి పైగా ప్రజలు పాల్గొంటారని ఆశించిన తెలుగుదేశం నాయకులు సభకు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడకూడదని 5000కూర్చులు, భోజనాలను ఏర్పాటు చేయగా దాదాపు 3000మంది పాల్గొన్నారు. ముగింపు సభ ఒకింత విజయవంతం అయినప్పటికీ అనుకున్న జన సమీకరణ చేయలేకపోయామే అని తెలుగుతమ్ముళ్లు డీలా పడ్డారు.