శివరాత్రికి సిద్దమవుతున్న రథం
రానున్న శివరాత్రి పండుగకు రథం సిద్దమవుతుంది. వివరాల్లోకి వెళితే స్థానిక నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించే శివరాత్రి పండుగ రథయాత్ర కోసం రథ మరమ్మత్తులు బుధవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే శివరాత్రి పండుగలో ప్రత్యేకంగా నిర్వహించే ఈ రథయాత్రను వీక్షించేందుకు పలు ప్రాంతాలనుండి వేలాదిమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రథ మరమ్మత్తులు చేయడం జరుగుతుందని తెలిపారు.