రోడ్డున పడ్డ చిరు వ్యాపారుల బతుకులు…
శనివారంనాడు అన్న క్యాంటీన్ ఏర్పాటు కొరకు చేపట్టిన పంచాయతీ ఆక్రమణల తొలగింపులో చిరువ్యాపారులు బతుకులు రోడ్డున పడ్డాయి. ఈ విషయమై అక్కడ వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు మాట్లాడుతూ గత 60సంవత్సరాలుగా ఇక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా అధికారులు వచ్చి ఖాళీ చేయిస్తే ఎక్కడికి వెళ్ళాలి అని వాపోతున్నారు. మాకు ఎక్కడైనా స్థలం చూపించి ఖాళీ చేయాలని అధికారులను కోరితే నిర్ధక్ష్యంగా ఉదయాన్నే వచ్చి రూములు పడవేశారని ఆరోపిస్తున్నారు. దయచేసి మాకు ఎక్కడైనా స్థలం కేటాయించాలని కోరుతున్నారు.