60సంవత్సరాలుగా చిరువ్యాపారాలు చేసుకుంటున్న పేదలు….. నోటీసులు ఇవ్వకుండానే తొలగింపు
అన్న క్యాంటీన్ ఏర్పాటు కొరకు స్థలం ఎంపిక చేసిన పంచాయతీ అధికారులు ఆక్రమణల తొలగింపు పనులు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే స్థానిక పెద్ద బస్టాండ్ నందు అన్న క్యాంటీన్ కొరకు 50×50 మీటర్ల స్థలాన్ని ఎంపిక చేసిన పంచాయతీ అధికారులు అక్కడే 60సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న పేదలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సూచనప్రాయంగా శుక్రవారం రాత్రి శనివారం ఉదయానికి మొత్తం ఖాళీ చేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం వచ్చి చూసిన అధికారులకు ఎవరూ ఖాళీ చేసిన దాఖలాలు లేకపోవడంతో పంచాయతీ కార్మికులను పిలిపించి ఆక్రమణలు శనివారం ఉదయం తొలగించారు.