ధర్మపోరాట దీక్షకు సంఘీభావంగా దీక్ష చేపట్టిన పొదిలి తెదేపా నాయకులు….
కేంద్రప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారంనాడు ఢిల్లీలో చేపట్టిన ఒక్కరోజు ధర్మ పోరాటదీక్షకు పొదిలిలోని స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్ లో పొదిలి మండల తెదేపా నాయకులు దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఇచ్చినమాట తప్పి ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్రప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా మోడీ ప్రభుత్వం తెలుగు ప్రజలకు చేస్తున్న అన్యాయాలకు నిరసనగా దీక్ష చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ చెప్పిడి రామలింగయ్య, మాజీ జడ్పీటీసీ జయదేవ్ కుమార్, మండల తెదేపా నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ముల్లా ఖుద్దూస్, ముల్లా షరీఫ్, కొత్తపాలెం మహబూబ్ బాషా, రత్నం, షేక్ జిలాని, ముని శ్రీనివాస్, జ్యోతి మల్లి, తెలుగు మహిళా జిల్లా కార్యదర్శి షేక్ షహనాజ్ తదితరులు పాల్గొన్నారు.