ఎల్ ఎల్ ఆర్ మేళా వినియోగించుకున్న గ్రామాల ప్రజలు….
ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ వారు నిర్వహించిన మీ ముంగిట్లో రవాణాశాఖ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలంలోని 4గ్రామ పంచాయతీలలో నిర్వహించిన ఎల్ ఎల్ ఆర్ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని దర్శి వాహన తనిఖీ అధికారి సురేంద్ర ప్రసాద్ తెలిపారు. మొత్తం 4గ్రామ పంచాయతీలలో 81మంది ఎల్ ఎల్ ఆర్ కు దరఖాస్తు చేసుకోగా నిర్వహించిన పరీక్షలో 74మంది దరఖాస్తుదారులు పాస్ అవ్వగా……. 7మంది దరఖాస్తు దారులు ఫెయిల్ అయ్యారని….. పాస్ అయిన వారికి ఎల్ ఎల్ ఆర్ జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.