సీఆర్పీఎఫ్ బలగాలపై భారీ ఉగ్రదాడి…… 39మంది జవాన్లు మృతి
పుల్వామ : జమ్మూకాశ్మీర్ లోని పుల్వామ జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు దాడిచేసిన ఘటనలో 39మంది జవాన్లు మృతి చెందగా….. మరో 40మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే పుల్వామ నుండి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై అవంతిపొరలోని గొరిపొర మెయిన్ రోడ్డులో ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. మొదట కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వాహనాలు నిలిచిపోగానే ఒక్కసారిగా ఐఈడి (అత్యాధునిక పేలుడు పరికరం) బాంబ్ దాడి చేశారు…….. ఈ బాంబు పేలుడు ధాటికి వాహనం తునాతునకలైంది……
అనంతరం ఓ ఉగ్రవాది ఒక్కసారిగా కారుతో కాన్వాయ్ పైకి దూసుకునిపోయి ఆత్మాహుతికి తెగబడ్డాడు. ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అదిల్ అహ్మద్ గా గుర్తించారు. కాగా దాడికి పాల్పడింది తామే అని జైషే మహమ్మద్ సంస్థ పేర్కొంది.
ఈ ఘటనలో 39మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందగా…. మరో 40మంది తీవ్రంగా గాయపడ్డారు.