పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ ముస్లింల ఆధ్వర్యంలో శాంతిర్యాలీ
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ పొదిలిలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. వివరాల్లోకి వెళితే విశ్వనాధపురం కాలేజిరోడ్డు సెంటర్ నుండి పెద్దబస్టాండ్ మీదుగా చిన్న బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ తీవ్రవాదం క్రూరమైన చర్య అని దీనికి ఇస్లాం పూర్తి వ్యతిరేకమని…. ఇలాంటి ఇటువంటి నరహంతక దాడిని ఇస్లాం సహించబోదని…… ఇటువంటి సంఘవిద్రోహ చర్యలకు గుణపాఠం చెప్పాల్సిందేనని అన్నారు…… అవసరమైతే దేశంకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని……… ఉగ్రవాదులపై పోరాటానికి సంసిద్ధంగా ఉన్నామని అన్నారు.
అలాగే పుల్వామా దాడిలో ప్రాణాలను అర్పించిన అమరవీరులకు జోహార్లు తెలుపుతూ వారి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలిపారు. అలాగే గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. భారత్ మాతాకి జై, ఉద్రవాదం నశించాలి, జై జవాన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు.