ఓటర్ రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోండి : తహశీల్దార్ ఎస్ ఎం హమీద్
ఓటర్ రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలని పొదిలి మండల రెవిన్యూ తహశీల్దార్ ఎస్ ఎం హమీద్ అన్నారు
వివరాల్లోకి వెళితే బుధవారంనాడు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోనటువంటి 18సంవత్సరాలు దాటిన యువత కోసం ఫిబ్రవరి 23, 24వ తేదీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని……
దరఖాస్తు చేసుకునే వారు ఫారం-6, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ జత చేసి సంబంధిత పోలింగ్ బూట్ నందు బూత్ లెవల్ ఆఫీసర్ కు అందజేయాలని…… అలాగే డిగ్రీ విద్యాసంస్థలలో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుందని నిర్ణిత తేదీలలో డిగ్రీ కాలేజీలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని……. ఈ రెండు తేదీలలో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.