గాంధీగిరికి దిగిన దివ్యాంగులు….. వినూత్న నిరసన
పొదిలి మండల దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు.
వివరాల్లోకి వెళితే మండలంలో దివ్యాంగులకు ప్రధానమంత్రి అవాస్ యోజన (పీఎంఏవై) పధకం క్రింద 39గృహాలు మంజూరు చేయగా…… వారు గృహ నిర్మాణం మొదలు పెట్టేందుకు తమకు నివేశన స్థలాలు లేకపోవడంతో తహశీల్దార్ ను సంప్రదించగా మీకు తప్పకుండా న్యాయం చేస్తానని రాజుపాలెం వద్ద నివేశన స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చి…….. 5నెలలుగా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై పలువురు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లగా మీరు నివేశన స్థల కేటాయింపుకు మీరు అర్హులు కాదని తెలిపారని……. 5నెలల కాలంగా తమకు స్థలాలు కేటాయిస్తామని మభ్యపెట్టి ఎలాంటి విచారణ జరపకుండా అర్హులు కాదు అని నిర్ధారించడం సబబు కాదని…….
ఫిబ్రవరి నెల ప్రారంభంలో తహశీల్దార్ కార్యాలయానికి ఈ విషయమై వెళ్లగా తహశీల్దార్ బదిలీపై వెళుతున్నారని…… బదిలీ లోగా మీ సమస్యకు పరిష్కారం చూపుతామని కలెక్టర్ వద్దకు రాజకీయ నాయకుల వద్దకు తిరిగే అవసరం లేదని విఆర్వోలు తెలిపారని అన్నారు. కూలి నాలి చేసుకుని బతికే దివ్యాంగులమైన మాకు న్యాయం చేయాలని కోరుతూ…….
వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తూ…… పది రూపాయల నోటును తమ ఆవేదనతో కూడిన వినతి పత్రానికి జతపరచిన పత్రాలను రెవిన్యూ సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు పంపిణీ చేశారు.
వినూత్న రీతిలో దివ్యాంగులు చేపట్టిన ఈ నిరసన గాంధీగిరిని తలపించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.