జనసేన మార్కాపురం టికెట్ కు దరఖాస్తు చేసుకున్న కీలక నేత….. టికెట్ ఖరారయ్యే అవకాశం
మార్కాపురం నియోజకవర్గ రాజకీయాలు రోజుకొకరకంగా మారుతున్నాయి… టికెట్ అభ్యర్థిత్వ ఆశావహులు తమ తమ పార్టీలలో తమకు తెలిసిన విధంగా నెగ్గుకొచ్చే అవకాశంకోసం తీవ్రంగా పావులు కడుపుతున్న నేపథ్యంలో…… ఓ కీలక నేత మాత్రం తనకున్న అవకాశం మాత్రమే వినియోగించుకోవాలని అనుకుంటున్నారు….. ఈ నేపథ్యంలోనే బుధవారంనాడు ఆయన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ టికెట్ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
పలు ప్రభుత్వాల పరిపాలనా కాలంలో నియోజకవర్గంలో రాణించిన ఆ నేత…. ప్రస్తుత పరిణామాలకు ధీటుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు….. కాగా ఈ విషయంపై ఇప్పటికే తన అనుచరులతో, నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపి వారి సలహాలు సూచనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
కాగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో నియోజకవర్గ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది….. అయితే ఆయనకు మాత్రం జనసేన స్క్రినింగ్ కమిటీ సానుకూలంగానే స్పందించిందని…… అయితే ఆయనకు టికెట్ దాదాపు ఖరరాయినట్లేనని సమాచారం.
ఇంతకీ ఎవరు ఆ కీలక నేత అనేది తెలుసుకోవాలంటే పాఠకులు కొంచెం వేచి చూడాలి.