మెట్రోలో సందడి చేసిన నరేంద్రమోదీ
న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైలులో భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణంతో మెట్రోలో సందడి వాతావరణం నెలకొంది. ఇస్కాన్ టెంపుల్ నందు “గీతా ఆరాధన మహోత్సవం” ప్రారంభోత్సవానికి హాజరైన మోదీ తిరుగుప్రయాణంలో మెట్రోలో ప్రయాణించారు.
ఒక్కసారిగా దేశప్రధానిని మెట్రోలో చూసిన ప్రయాణికులు ఆశ్చర్యచకితులై దగ్గరికి వెళ్లేందుకు భయపడగా….. ప్రధాని స్వయంగా కూర్చోమని చెప్పగా అనందంతో ప్రధాని దగ్గర కూర్చున్నారు. అనంతరం చిన్నపిల్లలను ముద్దాడిన మోదీ…. ప్రయాణీకులతో కాసేపు ముచ్చటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.