భారీ భగవత్గీత గ్రంథాన్ని ప్రారంభించిన మోదీ
న్యూఢిల్లీ : డిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ నందు భారీ భగవత్గీతను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.
2.8మీటర్ల ఎత్తు, 800కేజీల బరువు కలిగిన ఈ భగవత్గీత ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఇస్కాన్ తెలిపింది. ఈ సందర్భంగా భగవత్గీత సారాంశం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు తెలుసుకున్నారని…… అలాగే గీత యొక్క ఫలవంతమైన బోధనలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది ప్రజల జీవితాలను తాకిందని ప్రధాని నరేంద్రమోది ట్విట్టర్ వేదికగా తెలిపారు.