అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధం : నూకసాని యాదవ కార్పొరేషన్ ను ఆదర్శంవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
మార్కాపురం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు.
వివరాల్లోకి వెళితే స్ధానిక రోడ్లు మరియు భవనముల అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూకసాని మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ సిద్ధంగా ఉన్నానని… అదేవిధంగా రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ ను ఆదర్శంగా తీర్చిదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా యాదవులను అన్ని రంగాలలో అభివృద్ధి చెందే దిశగా పాటుబడడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, వీర్ల శ్రీనివాస్ యాదవ్, బత్తుల వెంకటేష్ యాదవ్, కనకం వెంకట్రావు, సన్నెబోయిన రాంబాబు, ఉదయ్ శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.