ఏపీకి కేంద్రం తీపికబురు… విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు
ఏపీ ప్రజల విశాఖ రైల్వేజోన్ కలను నిజం చేస్తూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత రైల్వేలో నూతన రైల్వేగా విశాఖ రైల్వే జోన్ కేటాయించినట్లు ఆయన తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ కు “సౌత్ కోస్ట్ రైల్వే” గా నామకరణం చేశామని……. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉంటాయని…… ఇప్పటి వరకు ఉన్న వాల్తేరు డివిజన్ ను రెండుగా చేసి ఒరిస్సా రాష్ట్రంలోని రాయఘడ్ మరియు విజయవాడ డివిజన్లలో కలిపామని తెలిపారు.
2014 ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసి కమిటీ నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం మనం కొనసాగుతున్న సికింద్రాబాద్ రైల్వే జోన్ కింద హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు ఉంటాయని ఆయన తెలిపారు.