వారం రోజుల నుంచి మంచి నీటి ట్యాంకర్లు బంద్ తీవ్రవేదన చెందుతున్న బుచ్చిపాలెం యస్ సి కాలనీ వాసులు
పొదిలి గ్రామ పంచాయతీ పరిధి లోని బుచ్చినపాలెం యస్సి కాలనీ కు మంచి నీటి ట్యాంకర్లు వారం రోజుల నుంచి నిలిపివేయడం తో కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు ఏదుర్కోకుంటున్నారు మనోవేదన చెందుతున్నరు. శనివారం పొదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగవరపు దీప ను కలిసి తమ మంచి నీటి సమస్య గురించి వివరించి నీటి సమస్యను పరిష్కారంచాలని అమె ను కోరగా అధికారులు తో మాట్లాడుతూని మీరు రక్షిత నీటి సరఫరా అధికారులు ను కలవండి అని తెలిజేయటంతో వారు రక్షిత నీటి సరఫరా అధికారులు లను కలిసి తమ సమస్యను వివరించారు. అధికారులు నీటి సమస్య ని పరిష్కారంస్తామని వారికి తెలియజేశారు