కుంచేపల్లిలో కందుల ప్రచారానికి విశేష స్పందన….
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది.
స్థానిక కుంచేపల్లి గ్రామంలో ఆయన నిర్వహించిన ప్రచారంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
అలాగే తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి అయిన నన్ను…… ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి అయిన సిద్దా రాఘవరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.