మండలంలోని పలు గ్రామాల్లో కుందూరు విస్తృత ప్రచారం……

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి మండలంలోని అన్నవరం, ఆముదాలపల్లి, చింతగంపల్లి, రాములవీడు, నిమ్మవరం, కొత్తపాలెం, బుచ్చెనపాలెం, మల్లవరం, జువ్వలేరు, అక్కచెరువు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు.

పర్యటించిన ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలు పూలమాలలతో, మహిళలు హారతులతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసింహరావు, జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, గుజ్జుల సంజీవరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, చెన్నారెడ్డి, జి శ్రీను నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.